Sunday, December 15, 2024

రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 1,16,14,349 నివాసాలకు గాను 65.02 శాతం అంటే 75,75,647 నివాసాలలో పూర్తయింది. సర్వేలో అత్యదికంగా ములుగు జిల్లా 95.3 శాతం అంటే 97,552 నివాసాలకు గాను 92,928 నివాసాల్లో సర్వే పూర్తి చేసి మొదటి స్థానంలో ఉంది. నల్గొండ జిల్లా 89.1 శాతం అంటే 5,04,542 నివాసాలకు గాను 4,49,434 నివాసాల్లో సర్వే పూర్తి చేసుకొని రెండో స్థానంలో నిలిచింది.

జనగామ జిల్లాలో 86 శాతం 1,59,452 నివాసాలకు గాను 1,37,069 నివాల్లో సర్వే పూర్తి చేసుకొని మూడో స్థానంలో నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో మొత్తం 25,05,517 నివాసాలకు గాను 11,10,883 (44.3 శాతం) నివాసాలలో సర్వే పూర్తి చేయడం జరిగింది. కాగా సర్వే తప్పులు లేకుండా జోనల్ అధికారులు, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి సమర్ధవంతంగా సర్వే జరిగేందుకు కృషి చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు ప్రభుత్వం నిర్దేశించిన ఫారాలు పూరించడంతో పాటు నిర్దేశించిన కోడింగ్ ప్రక్రియను మానిటరింగ్ అధికారులు నోడల్ అధికారులు , జోనల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News