Friday, January 27, 2023

విద్యుత్‌ఘాతంతో రైతు మృతి

- Advertisement -

మనతెలంగాణ/మఠంపల్లి : విద్యుత్‌ఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్త దొనబండతండా వద్ద శనివారం చోటు చేసుకుంది. స్ధానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణోతు బాబు(35) ఉదయం 8గంటల సమయంలో తన వ్యవసాయ పొలం వద్ద మొల్క చల్లేందుకు వెళ్ళాడు.

ఈ క్రమంలో మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడ తెగి పడి ఉన్న విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్‌ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్ ఆపేందుకు ఏవి స్విచ్ లేకపోవడం వల్లే రైతు మృతి చెందాడని ఏవి స్విచ్ ఏర్పాటు చేయాలని విధ్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ ఏర్పాటు చేయలేదని రైతు మృతికి విద్యుత్ అధికారులే భాద్యత వహించాలని మృతుడి బంధువులు ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles