Thursday, April 25, 2024

భూమి కోసం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల దీక్ష

- Advertisement -
- Advertisement -

నస్రుల్లాబాద్: మండలంలోని నెమ్లి గ్రామానికి చెందిన రైతులు, భార్య పిల్లలతో కలిసి నస్రుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మా భూమి మాకు ఇప్పించాలని రిలే నిరాహార దీక్షకు దిగారు. గత 7 రోజులుగా దీక్ష చేపడుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. బాన్సువాడ సీపీఎం నాయకులు జె.రవీందర్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతుండగా, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బంగారు మైసయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు.

నెమ్లి శివారులో గల భూమిని గత కొన్నేండ్ల క్రితం బతుకు దెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లగా, ప్రభుత్వం 17 మంది మత్స కారులకు వ్యవసాయం కోసం సాగు చేసుకోవాలని ఇచ్చిందన్నారు.తమ భూములను ఇతరులు కబ్జా చేశారని, భూములను చూపించాలని బాధితుడు గంగారాం ఆవేదన వ్యక్తం చేశాడు. 40 ఏండ్ల క్రితమే పట్టాలిచ్చారని, 2 ఎకరాల 20 గుంటల భూమికి నలుగురిపై పట్టాలున్నాయన్నారు. మత్సకారులకు భూములను రెవెన్యూ అధికారులు చూపించే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. గతంలో వ్యవసాయ రుణాలు సైతం పొందామన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News