Friday, September 13, 2024

కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ఎదుట రైతన్నల ధర్నాగ్రహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అమీర్‌పేట్ : ఓ పరిశ్రమ నుంచి వెలువడిన విషపూరిత జలాలను తాగి ఆరు గేదెలు మృతిచెందగా, మరో నాలుగు గేదెలు విషమ పరిస్థితిలో ఉండటం స్థానిక రైతులకు ఆగ్రహం తెప్పించింది. పలు పర్యాయాలు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని నిరసిస్తూ ఏకంగా సం గారెడ్డి జిల్లా జిన్నారం మండలం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సనత్‌నగర్‌లోని కాలుష్యనియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ముందు మృతిచెందిన గేదెలతో నిరసన వ్యక్తం చేశారు. బా ధిత రైతును ఆదుకుని…సదరు పరిశ్రమ యజమానులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టాయపల్లికి చెందిన రైతు బాశెట్టిగారి సాయికిరణ్ పది పాడిగేదెలతో జీవనోపాధి పొందుతున్నాడు. ప్రతినిత్యం సమీపంలో గేదెలను మేపేవాడు.

ఎప్పటిలాగే గడ్డిపోతారం గ్రామంలోని గేదెలు మేసి స మీపంలో ఉన్న అయ్యమ్మ చెరువులో నీటిని తాగా యి. స్థానికంగా ఉన్న రసాయన పరిశ్రమ నుంచి వెలువడిన విషపూరిత వ్యర్థాలను చెరువులోకి వ దులుతుండటంతో ఈ జలాలను తాగిన గేదెల్లో ఆ రు మృతిచెందగా, మరో నాలుగు విషమ పరిస్థితి లో ఉన్నాయి.పరిశ్రమ నుంచి వెలువడిన విషపూరిత వ్యర్థాల వల్లే గేదెలు చనిపోవడంతో రైతులు మృతిచెందిన గేదెలతో కాలుష్య నియంత్రణ మం డలి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వీటి ఖరీదు రూ.30 లక్షలు ఉంటాయని, సాయికిరణ్‌కు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. చెరువును విషపూరితంగా చేసిన పరిశ్రమ పై చర్యలు చేపట్టాలని, కలుషితం కాకుండా చూ డాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News