Thursday, July 10, 2025

వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ రహదారులపై ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఫాస్టాగ్ (Fastag) వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ వార్షిక పాస్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పాస్ కావాలంటే రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కారు, జీపులు, వ్యాన్‌లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పని చేస్తోంది.

ఇది అందుబాటులోకి రావడం వల్ల టోల్‌గేట్ల వద్ద వేచి ఉండటం, వివాదాలు తగ్గే అవకాశం ఉంది. చాలాకాలంగా ఫాస్టాగ్ (Fastag) వార్షిక పాస్ కావాలనే వాహనదారుల డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకొని దీన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్‌ని అందుబాటులోకి తీస్తామని గడ్కరీ వెల్లడించారు. రాజ్‌మార్గ్ యాప్‌తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్ల ద్వారా ఈ లింక్‌ అందుబాటులోకి రానుంది. లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుందని గడ్కరీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News