Wednesday, October 9, 2024

భారతీయ జెండాను అగౌరవపరిచిన తండ్రి, కొడుకు అరెస్ట్!

- Advertisement -
- Advertisement -

బరేలి: భారతీయ జాతీయ పతాకంలోని అకోక చక్రాన్ని చించేసి, దాని స్థానంలో అరబిక్ వాక్యాలు పెట్టినందుకు ఓ తండ్రి, ఆయన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా వారు చేసిన వెధవ పని పోలీసుల దృష్టికి రావడంతో చర్య తీసుకున్నారు. పైగా వారు మార్పులు చేసిన జెండా ముహమ్మద్ పూర్ లొకాలిటీలోని వారింటి కప్పు మీద గుర్తించినట్లు స్టేషన్ ఆఫీసర్ సంజయ్ తోమర్ తెలిపారు.

ముహమ్మద్ ఖదీర్, ఆయన కుమారుడు ముహమ్మద్ ఫాజిల్ లను జాతీయ గౌరవ భంగ నిరోధక చట్టం 1971 కింద అరెస్టు చేశారు. అంతేకాక వారిని శుక్రవారం జైలుకు పంపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News