Sunday, May 19, 2024

  బెట్టింగ్‌లు.. రెండు కోట్లు ఆస్తి పొగొట్టాడని కుమారుడిని హత్య చేసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

మెదక్: బెట్టింగ్‌లకు పాల్పడి రెండు కోట్ల ఆస్తి పొగొట్టుకోవడంతో కుమారుడిని తండ్రి హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బగిరాత్‌పల్లి గ్రామంలో సత్యనారాయణ మల్యాలలోని రైల్వేలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సత్యనారాయణకు ముకేశ్ కుమార్ (28) అనే వ్యక్తి ఉన్నాడు. ముకేశ్ బెట్టింగ్ పాల్పడుతూ రెండు కోట్ల రూపాయల పొగొట్టుకున్నాడు. బెట్టింగ్ అనేది అతడికి వ్యసనంగా మారడంతో పలుమార్లు తండ్రి హెచ్చరించిన పట్టించుకోలేదు.

బెట్టింగ్ విషయంలో తండ్రి, కుమారుడి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇనుపరాడ్డు తీసుకొని కుమారుడి తలపై బాదాడు. తలకు బలమైన గాయం కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెట్టింగ్ కారణంగా ముకేశ్ ఇల్లు, ప్లాట్లు అమ్ముకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News