Saturday, April 27, 2024

రూ.7వేల కోట్ల సిఎంఆర్ బియ్యం బొక్కేశారు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టే ఈ మొత్తం తతంగం వెనుక రైస్ మాఫియా కీలకపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో మిల్లర్ల సంఘం ముసుగులో కొందరు మిల్లర్ల ప్రతినిధులుగా చలామణి అవుతూ సిఎంఆర్ బియ్యం అప్పగించకుండా కోట్లు గడిస్తున్నారు. బియ్యం ఇవ్వకుండా ధాన్యం కేటాయింపులు జరిపేటప్పుడే క్వింటాలుకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నారు. ఈ రైస్ మాఫియా ఎంతగా తెగిస్తున్నదంటే మొత్తం బియ్యం ఎఫ్‌సిఐకి అప్పగించకుండా వాయిదాల మీద వాయిదాలు తెప్పిస్తూ బియ్యం ఎగవేతకు ప్రోత్సాహమందిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం దగ్గర చెడ్డ పేరు వస్తున్నది. అయినా రైస్ మాఫియాలోని కొందరు మిల్లర్ల లీడర్లు సీఎంఆర్ ధాన్యం బియ్యం అప్పగింతలో కుంభకోణాలు చేస్తున్నారు. కోట్లకు కోట్లు అక్రమార్జన యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీరుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రశంసలు పొందుతున్నా ధాన్యాన్ని బియ్యంగా మార్చే మార్చే ప్రక్రియలో రైస్ మాఫియా గ్రహణంలా మారింది.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సిఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడంతోనే రాష్ట్రంలో సిఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం అప్పగింతలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటిదాకా 23 లక్షల టన్నుల బియ్యం అనేక గడువులు ముగిసినా మిల్లర్లు ఎఫ్‌సిఐకి అప్పగించలేదు. దాదాపు రూ. 7వేల కోట్ల విలువ చేసే బియ్యాన్ని మి ల్లర్లు ఎఫ్‌సిఐకి అప్పగించకున్నా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఇతర జిల్లాల అధికారు లు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రభుత్వానికి ఈ విషయంలో వేలకోట్ల నష్టం జరుగుతున్నా అధికారులు మూగనోము పాటిస్తున్నారు. పైగా ఎఫ్‌సిఐ నుంచి మిల్లర్లకు మ రింత గడువు ఇప్పించేందుకు రాష్ట్ర, కేంద్రస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టే ఈ మొత్తం తతంగం వెనుక రైస్ మాఫియా కీలకపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో మిల్లర్ల సంఘం ముసుగులో కొందరు మిల్లర్ల ప్రతినిధులుగాచలామణి అవుతూ సిఎంఆర్ బియ్యం అప్పగించకుండా కోట్లు గడిస్తున్నారు. బియ్యం ఇవ్వకుండా ధాన్యం కేటాయింపులు జరిపేటప్పుడే క్వింటాలుకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నారు.

ఈ రైస్ మాఫియా ఎంతగా తెగిస్తున్నదంటే మొత్తం బియ్యం ఎఫ్‌సిఐకి అప్పగించకుండా వాయిదాల మీద వాయిదాలు తెప్పిస్తూ బియ్యం ఎగవేతకు ప్రోత్సాహమందిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం దగ్గర చెడ్డ పేరు వస్తున్నది. అయినా రైస్ మాఫియాలోని కొందరు మిల్లర్ల లీడర్లు సీఎంఆర్ ధాన్యం బియ్యం అప్పగింతలో కుంభకోణాలు చేస్తున్నారు. కోట్లకు కోట్లు అక్రమార్జన యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీరుకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రశంసలు పొందుతున్నా ధాన్యాన్ని బియ్యంగా మార్చే ప్రక్రియలో రైస్ మాఫియా గ్రహణంలా మారింది. వీరి ప్రతినిధులు ఒక పథకం ప్రకారం ధాన్యం సిఎంఆర్ కింద మిల్లులకు అప్పగించేటప్పుడే అవకతవకలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. నిజానికి ఈ కేటాయింపుల్లో సిఎంఆర్ ధాన్యాన్ని ఎఫ్‌సిఐకి నిజాయితీగా ఇచ్చేవారికి అధిక కేటాయింపులు చేయాలి, కానీ, కొందరు అక్రమ మిల్లర్లు మిల్లర్ల సంఘం ప్రతినిధులతో కుమ్మక్కై సిఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ. వేల కోట్లు ఎలాంటి పెట్టుబడులు లేకుండా అక్రమంగా ఆర్జిస్తున్నారు.

ఈ అక్రమాలను, అవినీతిని అడ్డుకోవాల్సిన యంత్రాంగ వ్యవస్థలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. రాష్ట్ర , జిల్లా స్థాయి లో విజిలెన్స్ యంత్రాంగాలు ఉన్నా వాటికి ఈ అక్రమాలు ఈ అవినీతి దృష్టికి రావడం లేదు. రాష్ట్రమంతాట 7వేల కోట్ల రూపాయల విలువ చేసే సిఎంఆర్‌ని మిల్లర్లు ఎగవేసినా చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం చేతులెత్తేసింది. రైస్ మాఫియా ఇటు రాష్ట్ర, అటు జిల్లా స్థాయి అధికారులతో వాటాల పంచుకుంటూ ధాన్యాన్ని ఎగవేసి ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నది. నిజానికి రాష్ట్రస్థాయిలో మంత్రులు , ప్రజాప్రతినిధులు ఇతరులకు ఈ కుంభకోణంతో సంబంధం లేకున్నా రైస్ మాఫియా వారి పేరుతో వసూళ్లకు తెగబడుతుంది. రాష్ట్రంలో వందలాది మిల్లులు సిఎంఆర్ లక్ష్యాలను నీరుగారుస్తున్నా అలాంటి వారికే అంటే సిఎంఆర్ ధాన్యం అప్పగించని మిల్లులకే ధాన్యం కేటాయింపులు చేస్తూ ప్రభుత్వానికి టోపి పెడుతున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఎక్కువగా జరిగే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ఈ మోసం ఎక్కువగా జరుగుతున్నది.

ఇక్కడి మిల్లలతో మిల్లర్ల ముసుగులోని ప్రతినిధులు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్లుగా సిఎంఆర్ ధాన్యానికి ఎగనామం పెట్టేలా చూస్తూ ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం తెస్తున్నారు. వాస్తవానికి, సిఎంఆర్ ధాన్యం అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు అంటే జైలు పాలు చేసేలా కఠిన నిబంధనలున్నా వాటిని అమలు చేయడం చిత్తశుద్ధి అధికార యంత్రాంగానికి లేదు. ఎవరు ఎటుపోతేనేమి తమ వాటాలు తమకు వస్తున్నాయని భావించి ప్రభుత్వానికే టోపి పెడుతున్నా కిమ్మనడం లేదు. రాష్ట్రంలో ధాన్యం ఎక్కువగా మరాడించే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో ఈ అవినీతి భారీ ఎత్తున సాగుతున్నది. ఇక్కడ 100కు పైగా మిల్లులు ఉంటే 36 మిల్లులు దాకా సిఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. ఒక్కో మిల్లు రూ. 3 కోట్ల దాకా ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని దానిని బయట విక్రయించి సొమ్ము చేసుకున్నా వారిపై చర్యలు లేకపోవడంతో సిఎంఆర్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది.

అయినా, ఈ జిల్లాల డిఎస్‌ఓలు, పౌర సరఫరాల డిఎంలు, జిల్లా జాయింట్ కలెక్టర్లు అక్రమ మిల్లర్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అంతే తప్పిస్తే వారిని జైలుకు పంపించేంత కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రస్థాయిలోని మిల్లర్లు, జిల్లా స్థాయి అధికారులతో కుమ్మక్కై సిఎంఆర్ కుంభకోణాన్ని పథకం ప్రకారం కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం సేకరణను దేశంలో ఎక్కడా లేని విధంగా గడువు ప్రకారం సేకరించి మిల్లులకు ఇస్తున్నది. ఈ మిల్లులు ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని ఎఫ్‌సిఐకి ఇవ్వాలి. ధాన్యాన్ని మరాడించినందుకు ప్రభుత్వం మిల్లర్లకు ఛార్జీలు చెల్లిస్తుంది. ఈ ప్రక్రియతోనే మిల్లర్లకు మంచి లాభాలు వస్తాయి, కానీ కొందరు గుడిని, గుడిలోని లింగాన్ని మింగేసే విధంగా ధాన్యాన్ని తీసుకొని దానిని బయట విక్రయించి పౌరసరఫరాల శాఖకు బియ్యం అప్పగించకుండా కుంటిసాకులు చూపుతున్నారు. రాజకీయ ప్రతినిధులకు తప్పుడు కారణాలు చూపి గడచిన మూడు సీజన్లుగా సిఎంఆర్‌ని ఎగవేస్తున్నారు.

కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయమై పలుమార్లు నిలదీస్తున్నది, అనేక దఫాలుగా గడువును విజ్ఞప్తులపై పొడిగిస్తున్నది. ఈ గడువు జనవరి 31 నాటికే ముగిసింది. అయినా 33 జిల్లాల్లో ఇప్పటికీ 23 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సిఐకి అప్పగించలేదు. ఇంకా గడువు కోసం మిల్లర్ల రైస్ మాఫియా ఢిల్లీలోనూ ప్రయత్నాలు సాగిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News