Saturday, October 5, 2024

ప్రభుత్వ పాఠశాలలో బీరు తాగిన విద్యార్థినులు

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్:  ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థినులు తన స్నేహితురాలు పుట్టిన రోజు సందర్భంగా బీరు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పుర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భట్ చౌరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలు తరగతి గదిలో బీరు తాగుతున్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అమ్మాయిలలో ఒకరు  వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసింది. దీనిపై విచారణ చేయాలని  త్రిసభ్య కమిటీని డిఇఒ టి ఆర్ సాహు ఏర్పాటు చేశారు.

పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. విచారణ కమిటీ సంబంధిత విద్యార్థులు, ఉపాధ్యాయులు నుంచి సమాచారం తీసుకొని దర్యాప్తు చేస్తుంది. ఖాళీ బీరు బాటిళ్లతో సరదాగా ఆడుకున్నామని, కానీ తాగలేదని విద్యార్థినులు కమిటీకి తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపించామని, వివరణ కూడా కోరుతామని డిఇఒ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News