Friday, May 17, 2024

భీకర పోరు

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1000కి పైగా మరణాలు

టెల్ అవీవ్: మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరుఆదివారం రెండో రోజు కూడా కొనసాగింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనికులకు, హమా స్ మిలిటెంట్లకు మధ్య పోరు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా శనివారం హమాస్ జరిపిన ఇజ్రాయెల్‌పై మెరుపు దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివర కు హమాస్ దాడుల్లో 600 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. మృతుల్లో సైనికులతో పాటుగా సామాన్య పౌరులు కూడా ఉ న్నారు. మరో 1800 మందికి పైగా గాయపడ్డా రు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది దాదాపు 400 మంది హమాస్ మిలిటెంట్లు చనిపోయారని, పదుల సంఖ్యలో మిలిటెంట్లను బందీలుగా పట్టుకున్నామని ఇజ్రాయెల్ రక్ష ణ దళం(ఐడిఎఫ్) ప్రకటించింది. ఐడిఎఫ్ మొత్తం శక్తిసామర్థాలను ఉపయోగించి హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెడతామని, అప్పటివరకు దాడులు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. ఇజ్రాయెల్ పౌరులందరినీ మట్టుబెట్టాలని హమాస్ చూస్తోందని నెతన్యాహు ట్విట్టర్ లో పేర్కొన్నారు. పిల్లలు, తల్లులు నిద్రిస్తుండగా వారిని మట్టుబెట్టిన శత్రువని హమాస్‌పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరదాగా సెలవులు గడపడానికి వెళ్లిన సామాన్య పౌరులను, పిల్లలను కూడా కొట్టి చంపుతున్నారని ఆరోపించారు.

మరోవైపు హమాస్ ఉగ్రవాదులు వందమందికి పైగా ఇజ్రాయెల్ సైనికులను, పౌరులను అపహరించినట్లు టెల్ అవీవ్ ఇప్పటికే ప్రకటించింది. వీరిని క్షేమంగా విడిపించడానికి ఇజ్రాయెల్ ఈజిప్టు సాయాన్ని కోరింది. గాజా స్ట్రిప్‌కు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలయిన ఒఫాకిమ్, డెరాట్, యాడ్ మోర్డెచాయ్,కఫర్ అజ్జా, యాటిడ్, కిస్సుఫిమ్ తదితర ప్రాంతాల్లో హమాస్, ఇజ్రాయెల్ సైన్యాల మధ్య ఇంకా పోరాటం కొనసాగుతున్నట్లు అటు ఇజ్రాయెల్ సైన్యం, ఇటు హమాస్ కూడా ప్రకటించాయి. గాజాస్ట్రిప్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ హెచ్చరిక సైరన్ల మోతలు వినిపిస్తూనే ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పోరు తీవ్రమైన నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజా ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపి వేసింది. విద్యుత్, ఇంధనంతో పాటుగా ఆహార సరఫరాలను కూడా ఆపేస్తామని నెతన్యాహు హెచ్చరించారు.
రంగంలోకి హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ
మరో వైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ‘హిజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. ఆదివారం హిజ్బొల్లా గ్రూపు డజన్ల కొద్దీ రాకె ట్లు, మోర్టార్ షెల్స్‌ను ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్ అధీనంలోని గోలాన్ హైట్స్ వద్ద ఉన్నాయి. ఈ దాడులపై హిజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్ ను ఉపయోగించినట్లు తెలిపింది. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా తాము ఈ దాడి చేసినట్లు తెలిపింది. హిజ్బొల్లా కూడా యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. మరో వైపు హిజ్బొల్లా దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో ఎంతమంది మరణించారో మాత్రం ప్రకటించలేదు.
ఇజ్రాయెల్‌కు అమెరికా తక్షణ సాయం
కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు 100 బిలియన్ డాలర్ల విలువైన అత్యవసర మిలిటరీ సాయం ప్యాకేజిని ఆమోదించారు. శనివారం బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మరో వైపు ఇరాన్ విదేశాంగ శాఖ హమాస్‌కు మద్దతు ప్రకటించింది. హమాస్ జరిపిన దాడిని పాలస్తీనియన్లు ఆత్మరక్షణ కోసం జరిపిన చర్యగా అది అభివర్ణించింది. మరో వైపు ఇజ్రాయెల్ సైనిక చర్యను ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ తీవ్రంగా ఖండించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా వందలాది మంది పౌరులు మృతి చెందగా, వేలాది మంది గాయపడ్డారని 56 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధ వాతావరణం దృష్టా రొమేనియా ఇజ్రాయెల్‌లోని వందలాది మంది తమ పౌరులతో పాటుగా ఇతర దేశాలకు చెందిన వారిని అక్కడినుంచి తరలించింది.
భారతీయులు క్షేమం
కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య పోరు తీవ్రమైన నేపథ్యంలో ఇజ్రాయెల్, గాజా ప్రాంతాల్లో నివసిస్తున్న బారతీయుల యోగక్షేమాల పట్ల దేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు భారతీయులకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్లు వార్తల్లు రాలేదు. అయితే తాము క్షేమంగాఅక్కడినుంచి బయటపడేందుకు సాయమందించాలంటూ అక్కడ చిక్కుకు పోయిన భారతీయ పౌరులతో పాటు పర్యాటకులనుంచి టెల్ అవీవ్‌లోని భారత దౌత్యకార్యాలయానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న సంబంధించి అధికారికంగా లెక్కలు లేనప్పటికీ దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో అక్కడ పని చేస్తున్న వారే కాక విద్యార్థులు ఉన్నారు. వీరే కాకుండా భారత్‌నుంచి వెళ్లిన పర్యాటకులనుంచి కూడా రాయబార కార్యాలయానికి విజ్ఞప్తుల అందుతున్నాయి. పర్యాటకుల్లో చాలామంది గ్రూపులుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగాఇజ్రాయెల్, పాలస్తీనాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఏదయినా అత్యవసర పరిస్థితి ఎదురైతే తమ కార్యాలయాలను సంప్రదించాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం, పాలస్తీనాలోని భారత ప్రతినిధి కార్యాలయం అడ్వైజరీలు జారీ చేశాయి. భారతీయులందరికీ అవసరమైన గైడ్‌లైన్స్ ఇవ్వడానికి తాము రోజులో 24 గంటలు అందుబాటులో ఉంటామని టెల్ అవీవ్‌లోని భారత దౌత్య కార్యాలయం తెలియజేసింది. కాగాయెమన్, ఉక్రెయిన్ తరహాలో ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, అయితే పరిస్థితి కుదుటబడే వరకు గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ వారు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి చెప్పారు.
వారం పాటు ఎయిరిండియా విమానాలు రద్దు
ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్టా భారత్‌నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.‘ ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్టా టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే విమానాలను ఈ నెల 14 వరకు నిలిపి వేస్తున్నాం’ అని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తేదీల్లో టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తామని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News