Friday, April 26, 2024

ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 1 కోటి.. ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్

- Advertisement -
- Advertisement -

సిమ్లా: కొత్త స్కూటీకి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం బిడ్డింగ్‌లో రూ. 1 కోటికి పైగా టెండర్ వేసిన ముగ్గురు ఆతతాయి బిడ్డర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ముకేష్ అగ్నిహోత్రి అధికారులను ఆదేశించారు. హెచ్‌పి 99 9999 అనే ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తూ హిమాచల్ ప్రదేశ్‌లోని కోట్‌ఖై రిజిస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీకి ఫిబ్రవరి 6న రూ. 1 కోటికి పైగా కోట్ చేస్తూ మూడు బిడ్స్ వచ్చాయి.

అయితే ఈ మూడు బిడ్లు వేసిన వారు ఆకతాయిలని తేలడంతో ఆన్‌లైన్ వేలంను రిజిస్ట్రేషన్ శాఖ రద్దు చేసింది. ఆ ముగ్గురు బిడ్డర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి అగ్నిహోత్రి అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయాలని, నాన్ సీరియస్ బిడ్డర్లను తొలగించే ప్రక్రియతోపాటు ఎర్నెస్ట్ మనీని డిపాజిట్‌గా తీసుకునే నిబంధన చేర్చాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News