Home జాతీయ వార్తలు గోశాలలో మంటలు

గోశాలలో మంటలు

మాడి మసయ్యిన 20 పాడి ఆవులు

Man rape on cows in Kerala

 

న్యూఢిల్లీ : స్థానిక డెయిరీ ఫార్మ్‌లో ఘోరం జరిగింది. ఈ గోసంరక్షణ కేంద్రంలో మంటలు చెలరేగడంతో 20 ఆవులు సజీవ దహనం చెందాయి. తెల్లవారుజామున మంటలు తలెత్తడంతో రోహినీ ప్రాంతపు శివారు గ్రామం సావ్‌దా గ్రామానికి హుటాహుటిన అగ్నిమాపక శకటాలు బయలుదేరి వెళ్లాయి. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకుని మూగజీవాలు మసి అయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నెలలో గజియాబాద్‌లో ఇందిరాపురం గ్రామంలో ఇదే విధంగా మంటలలో 38 గోవులు కాలిపొయ్యాయి. సమీపంలోని చెత్తచెదారపు స్థావరంలో మంటలు లేచి అవి పక్కన ఉన్న పాడి కేంద్రానికి వ్యాపించినట్లు తేలింది. ఇప్పుడు ఢిల్లీ శివారు గ్రామంలోని డెయిరీ ఫార్మ్‌లో మంటలకు కారణాలు ఇప్పటికి వెల్లడికాలేదు. అయితే గోవులు ఈ విధంగా దారుణరీతిలో కాలిపడిపోయి ఉండటంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.