Monday, June 17, 2024

ఢిల్లీ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..ఆరుగురు శిశువులు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వివేక్‌ విహార్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్థరాత్రి బేబీ కేర్‌ ఆస్పత్రిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మృతి చెందినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో 12మంది పిల్లలను రక్షించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఓ నవజాత శిశువుకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News