Saturday, April 20, 2024

ఆరుగురు ఆహుతి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు గురు దుర్మరణం చెందారు. ఐదో కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో స్పృహ తప్పిపడిన ఆరుగు రు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులు ప్రమీల, శివ, శ్రావణి, వెన్నెల, త్రివేణి, ప్రశాంత్‌లుగా గుర్తించారు. ఈ అగ్నిప్రమాద ఘటన లో మరో ఎనిమిది మందిని సురక్షితంగా అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్‌ఎంసి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

అగ్ని ప్రమాద బాధితులకు అందుతున్న చికిత్స తీరు ను పరిశీలించారు. కాంప్లెక్స్‌లోని 7,8 అంతస్థు ల్లో బట్టల దుకాణం, గోదాంలు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్లో 15 మంది వర్కర్లు చిక్కుకున్నట్లు ఆయా షాపుల యజమానులు అగ్నిమాప సిబ్బందికి చెప్పారు. వెంటనే వారిని రక్షించేందుకు రంగంలోకి దిగి న అగ్నిమాపక సిబ్బంది భారీ హైడ్రాలిక్ క్రేన్ సాయంతో పలువురిని కాపాడి కిందికి తీసుకొచ్చారు. మంటల్లో చిక్కుకున్న వారిలో ఆరుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. కాంప్లెక్స్ మొత్తం పొగలు అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది అంతస్థుల్లో చిక్కుకున్న వారిని కిందికి తీసుకుని వచ్చేందుకు ఇబ్బంది ఎదురైంది. రాత్రి 7.45 గంటలకు అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే నాలు ఫైరింజన్లను రప్పించిన అధికారులు మంటలను అదుపు చేశారు.

విద్యుత్ సరఫరా లేకపోవడం, లిఫ్టులు పనిచేయకపోవడంతో, చీకటి ఉండడంతో మంటల్లో చిక్కుకున్న వారు కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. అంతేకాకుండా పై అంతస్థుల్లో చిక్కుకున్న వారు తమను కాపాడాలని మొబైల్ ఫోన్ టార్చ్ చూపిస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. టార్చ్ లైట్‌ను చూసి అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడారు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కాంప్లెక్స్‌లో 200 షాపులు, 160 ఆఫీసులు ఉండడంతో అధికారులు ముందుగా ఆందోళనకు గురయ్యారు. మిగతా అంతస్థులో మంటలను అదుపు చేసిన సిబ్బంది, ఐదో అంతస్థులో మంటలను అదుపులోకి తీసుకుని రాలేకపోవడంతో మొత్తం అగ్నికి ఆహుతైంది.

కాంప్లెక్స్‌లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారనే దాని పై అధికారులు అర్ధరాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బయ టకు తీసుకువచ్చిన వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండ డంతో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిఉన్నతాధికారులతో ఫోన్‌లో సమీక్షించడమే కాకుండా ఘటనా స్థలికి వచ్చి పర్యవేక్షించారు. మంత్రి మహమూద్ అలీ కూడా స్వప్నలోక్‌కు వచ్చి పరిశీలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎవరిని అటువైపు రాకుండా చర్యలు తీసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వారి మొబైల్ నంబర్ తీసుకుని వారికి ఫోన్లు చేసి ఏ అంతస్థులో ఉన్నారో తెలుసుకుని కాపాడారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News