Monday, September 1, 2025

‘కొక్కొరొకో’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ దర్శక, నిర్మాత రమేష్ వర్మ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ ప్రొడక్షన్ కంపెనీ మీద నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ ‘కొక్కొరొకో’ని ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో ముహూర్తపు షాట్‌కు నిర్మాత రేఖ వర్మ క్లాప్ కొట్టగా.. నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. ఈ మూవీతో శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వినూత్నమైన కథతో శ్రీనివాస్ వసంతల ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

ప్రముఖ స్క్రీన్ రైటర్ జి.సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ నేపథ్య గాయకుడు జివి సాగర్ ఈ మూవీకి సంభాషణలు రాసే బాధ్యతను స్వీకరించారు. తన తండ్రి వారసత్వాన్ని అనుసరించి ‘రాక్షసుడు’ తర్వాత రచయితగా రెండో ప్రాజెక్ట్‌ని సాగర్ చేపట్టారు. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మ స్వయం గా రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Also Read : కర్ణాటక సీఎంని కలిసిన గ్లోబల్ స్టార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News