Sunday, September 15, 2024

మరో ఐదు రోజులు వర్షాలు

- Advertisement -
- Advertisement -

వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు వాగులువంకలు పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా కనుచూపుమేరంతా వర్షంనీరే కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. వర్షాలు మరో ఐదురోజుల పాటు కొనసాగుతాయని హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సోమవారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు నమోదవుతాయని అంచనా వేసింది.

కాకర్వాయ్‌లో 52సెం.మి వర్షం :
రాష్టంలో ఆదివారం అతిభారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కాకర్వాయ్‌లో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తిలో 45.6, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45.4, మహబూబాబాద్ చిన్నగూడూర్‌లో 45.2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది.అంతే కాకుండా సూర్యపేట వరంగల్ ఖమ్మం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో 25సెంటీమీటర్ల నుంచి 35సెటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదయింది.రాష్ట్రంలోని 165 ప్రాంతాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News