Saturday, April 20, 2024

వృద్ధాప్యంలోని మతిమరుపుని తగ్గించే ఫ్లేవనాయిడ్స్

- Advertisement -
- Advertisement -

టీ, యాపిల్, బెర్రీస్, వంటి ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభించే వాటిని తీసుకుంటే వృద్ధాప్యంతో వచ్చే మతిమరుపును తగ్గిస్తాయని పరిశోధనలో వెల్లడైంది. 71 ఏళ్లు పైబడిన దాదాపు 3562 మందికి రోజూ ఫ్లేవనాయిడ్స్ అందిస్తూ మూడేళ్ల పాటు అధ్యయనం చేయగా, వారి మెదడులో హిప్పోకాంపస్ అనే అవయవం బాగా వృద్ధి చెందిందని, ఫలితంగా జ్ఞాపకశక్తి ఎలాంటి క్షీణించకుండా రక్షించబడిందని తేలింది. హిప్పోకాంపస్ అంటే మెదడులో భావోద్వేగాలను, దీర్ఘకాల జ్ఞాపకాలను నియంత్రించే చిన్న అవయవం. ఈ పరిశోధన అమెరికా జర్నల్ “ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ” లో వెల్లడైంది.

రోజూ కనీసం 500 ఎంజి ఫ్లేవనాయిడ్స్ తీసుకుంటే జ్ఞాపకశక్తి పై వ్యతిరేక ప్రభావం బాగా తగ్గుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫ్లేవనాయిడ్ పోషకాలు లోపించే వారిపై ఫ్లేవనాయిడ్ వ్యతిరేక ప్రభావం ఏమీ ఉండబోదని చెప్పారు. బ్రిటన్‌లో చాలా మంది పెద్దలు అత్యధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్స్‌ను టీ, యాపిల్, బెర్రీస్ రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. వృధ్ధాప్యం చెందిన వారి మెదళ్లకు వివిధ రకాలైన పోషక విలువలు అవసరమవుతాయని, దానివల్ల వారు మెదళ్లు బలపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మేరకు కొలంబియా యూనివర్శిటీకి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ స్కాట్ స్మాల్ నేతృత్వంలో పరిశోధన ప్రారంభించారు.

సాధారణంగా మొక్కలు, , కూరగాయలు, పండ్ల నుంచి ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనేక జబ్బులు తగ్గుతాయి. ఫ్లేవనాయిడ్స్ గట్ మైక్రోబియమ్‌తో కలిసి మనల్ని రక్షిస్తాయని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి కూడా రక్షిస్తాయని తేలింది. అయితే ఇవి ఎలా లభిస్తాయంటే ఉదాహరణకు యాపిల్‌ను తీసుకుంటే యాపిల్ తొక్క ఎంతో మేలు చేస్తుంది. ఎర్రద్రాక్షలో కామన్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వేరే ద్రాక్ష కన్నా ఈ ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ అపారంగా ఉంటాయి. మనకు అప్పుడప్పుడు లభించే బ్లాక్ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. రాస్ బెర్రీస్‌లో ఫ్లేవనాయిడ్స్ అత్యధికంగా ఉన్నందున జలుబు, ప్లూ, వైరస్ ఇన్‌ఫెక్షన్లు మనకు అంతగా రావు. కమలా పండ్ల నుంచి కూడా ఫ్లేవనాయిడ్స్ అందుతాయి.

ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్లేవనాయిడ్స్ మనకు లభించి ఆరోగ్యం క్రమబద్ధీకరణ అవుతుంది. క్యాబేజీ కూడా ఆరోగ్యానికి మంచిది. దీనికంటే ఎర్రక్యాబేజీ ఇంకా మంచిది. అన్ని కాలాల్లో లభించే క్యారెట్ల వల్ల అయిదారు రకాల ఫ్లేవనాయిడ్స్ మనకు అందుతుంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ లక్షణాలు వైరస్ నుంచి మనల్ని రక్షిస్తాయి. తాజా ఉల్లిపాయల్లోనూ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలు లేదా ఫ్రై చేసిన ఉల్లి వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. రెడ్ వైన్, బ్లాక్ టీ లో కూడా ఫ్లేవనాయిడ్స్ దొరుకుతాయి. 100 మిల్లీ లీటర్ల బ్లాక్ టీలో దాదాపు 200 మిల్లిగ్రాముల ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. గ్రీన్‌టీలో 71 నుంచి 126 మిల్లీ గ్రాముల ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. సోయా, బీన్స్, డార్క్ చాక్లెట్స్ లోనూ ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News