Saturday, May 4, 2024

టెట్‌కు దరఖాస్తుల వెల్లువ

- Advertisement -
- Advertisement -
రేపటితో ముగియనున్న గడువు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, సోమవారం నాటికి 2,23,811 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. దీంతో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆఖరు వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీచర్ వృత్తిలో అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే టిఆర్‌టి, గురుకుల ఉపాధ్యాయ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
టెట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చి దరఖాస్తు గడువు పెంచాలి
టెట్ దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించి, దరఖాస్తు గడువు పెంచాలని తెలంగాణ రాష్ట్ర డి. ఎడ్ బి. ఎడ్ అభ్యర్థులు సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురుకుల పరీక్షల వల్ల సుమారు లక్ష 50 వేల మంది అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదని, అలాగే చాలా మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసినప్పుడు కొన్ని పొరపాట్లు చేశారు కాబట్టి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చి అందరికీ హాల్ టికెట్లు జారీ అయ్యేలా చూడాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News