Wednesday, May 22, 2024

సిఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం చెలరేగింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సాయంత్రం మల్కాజ్‌గిరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో శామీర్‌పేటలో ఆయన హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం చెలరేగింది.

ఓ వ్యక్తి డ్రోన్‌ను ఎగురవేశాడు. హెలిప్యాడ్ వద్ద డ్రోన్‌ను ఎగరవేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. అయితే పోలీసుల విచారణలో డ్రోన్ ఎగురవేసిన వ్యక్తి రామంతపూర్ కు చెందిన గణేశ్ రెడ్డిగా గుర్తించారు. బిజెపితో కెసిఆర్ కుమ్మక్కు అయ్యారని, రాష్ట్రంలో 5 ఎంపి స్థానాల్లో బిజెపిని గెలిపించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. గడిచిన పదేళ్లుగా బిఆర్‌ఎస్, బిజెపి ఎంపిలు తెలంగాణకు సాధించిందేమిటని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News