Thursday, May 2, 2024

బిఆర్‌ఎస్‌లోకి ఏపూరి సోమన్న

- Advertisement -
- Advertisement -

మళ్లీ కాలికి గజ్జె కడతా…
అభివృద్ధిపై పాట పాడతా
కెసిఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు
నా జీవితాన్ని కెసిఆర్ చేతుల్లోనే పెడుతున్నా
ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తా : సోమన్న
హైదరాబాద్ : ప్రజాగాయకుడు, వైఎస్ ఆర్‌టిపి మాజీ నేత ఏపూరి సోమన్న బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. బిఆర్‌ఎస్ నాయకులు మధుసూదనాచారి, బాల్క సుమన్, దేశపతి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏపూరి సోమన్న గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపూరి సోమ న్న మాట్లాడుతూ, తెలంగాణలో కెసిఆర్‌కు ప్రత్యామ్నా యం లేదని అన్నారు.

రాష్ట్రంలో విపక్షాలు పూర్తిగా విఫల మయ్యాయని విమర్శించారు. పదేళ్ల తర్వాత తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టానని, తెలంగాణ భవన్‌కు వస్తే తన ఇంటికి తిరిగి వచ్చినట్లుగా ఉందని పేర్కొన్నారు. తెలం గాణ భవన్ తనకు కొత్త కాదు అని..పరాయోని లెక్క… కిరాయోని లెక్క బయట ఉండాల్సిన అవసరం కూడా తనకు లేదని చెప్పారు. సిఎం కెసిఆర్ పాలనలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని బిఆర్‌ఎస్ చేరుతు న్నట్లు ఏపూరి సోమన్న ప్రకటించారు. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ…. ఎవడే లుతున్నడురో తెలంగాణ అని ప్రశ్నించిన తాను ఒక దశా బ్దికాలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ వ్యవస్థ వస్తుం దేమో అని కలగన్నానని పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయం రానప్పుడు…నమ్మకంగా ప్రజలకు అన్నీ చేస్తున్నప్పుడు… ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నప్పుడు.. పాల మూరు వలసలు ఆగినప్పుడు…నల్గొండ ఫ్లోరోసిస్ బాధ పోయినప్పుడు…రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తయితున్నప్పుడు… కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణమై చెరువులు మత్తడిదుంకి అలుగుపోస్తున్నపుడు బిఆర్‌ఎస్‌లో చేరడంలో సరైన నిర్ణయం అని భావించి పార్టీలో చేరుతున్నానని చెప్పారు. రూపాయిలో మూడో వంతు ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారు కాబట్టి ఆ ప్రజల వెంటే తాను ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు.
పాటకు పట్టం కట్టి చట్టసభల్లో కూర్చోబెట్టిన నేత కెసిఆర్
తెలంగాణకు కెసిఆర్ తప్ప ప్రత్యామ్నాయం లేదు అని ఏపూరి సోమన్న స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులను గుర్తించి ఉద్యోగాలు ఇచ్చి గౌరవించుకున్న పార్టీ బిఆర్‌ఎస్ అని, తెలంగాణ పాటకు పట్టం కట్టి చట్టసభల్లో కూర్చోబెట్టిన నేత కూడా కెసిఆరే అని గుర్తు చేశారు. తెలంగాణ ఎవడి పాలయ్యింది అని అడిగింది నేనే… తెలంగాణ బరాబరి ఉద్యమకారుడి పా లయ్యింది, కెసిఆర్ పాలయ్యింది… కెసిఆర్ పాలే కావా లని చెబుతున్నది తానే అని పేర్కొన్నారు. తన పాట ఎప్పుడూ ప్రజల పక్షమే ఉంటది.. నా పాట తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగమైతదని స్పష్టం చేశారు. తన పాట ఎప్పుడూ ఆగిపోదు అని… ప్రగతి పదమై సాగిపో తుందని చెప్పారు.

తెలంగాణ పట్ల లక్షం ఉన్న వాళ్లు ఎప్పుడో ఒక రోజు తెలంగాణ భవన్ మెట్లే ఎక్కుతారని అన్నారు. తాను 25ఏళ్లు కష్టపడితే ఈ తెలంగాణ భవన్ కు రాగలిగినా అని పేర్కొన్నారు. తాను నిర్భందాల పాలయినప్పుడు…సాంబశివుడితో తిరిగితే నయీం లాంటి వాడి చేతిలో చనిపోతానని తెలిసి, గద్దర్‌తో పాట పాడితే నిర్భందాల పాలవుతానని తెలిసి కూడా ఎవనికీ భయపడలేదని, ఎవరికీ తలవంచలేదని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌కు వస్తే తాను తలవంచినట్లు కాదని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి తన పాట కూడా భాగమైత దని చెప్పారు. తెలంగాణ నిర్మాణంలో నా చెమట చుక్క ఉంది…ఇక్కడికి వచ్చే అర్హత కూడా ఉందదని అన్నారు.

ఇక నుంచి నేను మళ్లీ గజ్జె కడతా…తెలంగాణ అభివృద్ధి లో భాగమైతా అని ఏపూరి సోమన్న పేర్కొన్నారు. తెలం గాణ అభివృద్ధిలో నా ఆట…పాట ఉంటదని వెల్లడిం చారు. నా పాట..మాట ఎప్పటికీ పేదల పక్షమే అని, పేద వర్గాలు చదువుకోవాలె..అభివృద్ధి ఫలాలు అందుకోవాలె అనేలాగా నా పాట ఉంటుందని ఉద్ఘాటించారు. నేను ఎప్పుడూ నిజమే మాట్లాడతా…నిర్భయంగా మాట్లాడతా అని స్పష్టం చేశారు. ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసు కుంటానని చెప్పారు. నన్ను నాయకుడిగానైనా..గా యకు డిగానైనా …ఇంకా ఎలాగైనా నా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది కెసిఆరే అని తెలిపారు. తన జీవితాన్ని కెసిఆర్ చేతుల్లోనే పెడుతున్నానని…ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తానని ఏపూరి సోమన్న తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News