Sunday, June 8, 2025

వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే .. యవ్వనంగా మారడం ఖాయం..

- Advertisement -
- Advertisement -

ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. దీనిని ఎవరు ఆపలేరు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆరోగ్యంతో పాటు చర్మంలో అనేక మార్పులు వస్తాయి. శరీర జీవక్రియ మందగించడం మొదలవుతుంది. అదేవిధంగా చర్మంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. ముడతలు, గీతలు, చర్మం వదులుగా ఉండడం వంటి సమస్యలు ప్రారంభమవుతాయి.

అయితే మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మన చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా, బిగుతుగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. అలాంటి ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోజు మనం తీసుకునే ఆహారంలో టమోటా భాగమై ఉంటుంది. టమోటాలో ఉండే బీటా-కేరోటిన్ మన చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది. అంతేకాకుండా.. మొహం పై మచ్చలు, ముడతలను కూడా టమోటా తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ -సి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

నారింజ, కివి వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరుస్తూ, బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ పెంచడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్ అనేది చర్మాని స్థితిస్థాపకతను కాపాడుకోవడానికి, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడు ఒక రకమైన ప్రోటీన్.

ఆకుపచ్చ కూరగాయలు అనగా పాలకూర బ్రోకలీ క్యాబేజీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడటమే కాకుండా చర్మాని బిగుతుగా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దీంతో చర్మం చాలా కాలం పాటు యవ్వనంగా కనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News