- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రియల్టర్ పురుషోత్తం నాయుడుపై ఫోర్జరీ కేసు నమోదైంది. విజన్ రిసార్ట్స్ భాగస్వామి గంటా రాజశేఖర్ రావు ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంట్లోకి చొరబడి సంతకాలు పెట్టమని ధర్మారెడ్డి బెదిరిస్తున్నారని గంట రాజశేఖర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు.
- Advertisement -