Tuesday, September 16, 2025

మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైసిపి మాజీ మంత్రి విడదల రజనికి మరో షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఎపి పోలీసులు.. గోపిని అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలపై ఎసిబి నమోదు చేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, వైసిపి పాలనలో విజిలెన్స్‌ సోదాల పేరుతో స్టోన్‌క్రషర్‌ యాజమానిని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలపై ఇప్పటికే మాజీ మంత్రి రజినిపై ఎసిబి కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News