Tuesday, September 17, 2024

కాగ్నిజెంట్ విస్తరణకు నేడే ముహూర్తం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. నేడు హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో తమ కొత్త క్యాంపస్‌ను నిర్మాణం చేయనున్న నేపథ్యంలో నేడు ఉదయం సిఎం రేవంత్‌రెడ్డి దానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సిఎం విదేశీ పర్యటనలో పెట్టుబడులకు సంబంధించి బిజీబిజీగా గడిపారు. విదేశాల్లో జరిగిన సమావేశాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉండే అవకాశాలు, వాటికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి సిఎం ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఈ పర్యటనలో సిఎం తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News