Sunday, September 15, 2024

విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి: సిఎం ఎక్స్ గ్రేషియా ప్రకటన

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడలో భారీ వర్షానికి మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. బండరాళ్లు విరిగి పడ్డంతో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు విడిచారు. దీనిపై సిఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని కూడా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News