ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందా రు. మృతి చెందిన వారిలో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అల్లూరి జిల్లా వై రామ వరం, జీకేవీధి మండలాల్లో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ కూంబింగ్‌లో మావోయిస్టులు ఎదురుపడటంతో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచార ం అందింది. ఈ కాల్పుల్లో మావో యిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మావోయిస్టు నేత జగన్‌పై రూ.20 లక్షల రివార్డ్ ప్రకటించి ఉన్నారు. మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుం చి మొత్తం రెండు ఎకె-47లు స్వాధీ నం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ పై మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా నక్సలైట్ల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా భద్రతా బలగాలు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ కొన సాగిస్తూ మావోయిస్టులను మట్టు బెడుతున్నారు.