Saturday, July 27, 2024

రామ్‌సర్ జాబితాలో మరో నాలుగు ప్రాంతాలకు గుర్తింపు

- Advertisement -
- Advertisement -
Four more sites in India added to Ramsar list
దేశానికి గర్వకారణం:  ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలోని మరో నాలుగు ప్రాంతాలను రామ్‌సర్ జాబితాలో చేర్చడం గర్వకారణమని ప్రధాని మోడీ ట్విట్ చేశారు. సహజ ఆవాసాలను సంరక్షించుకుంటూ వచ్చిన భారత సంప్రదాయాలకు ప్రతీకగా ఈ గుర్తింపును భావించాలని ప్రధాని ట్విట్ చేశారు. వృక్ష, జంతుజాలాన్ని సంరక్షించడం ద్వారా భూగోళాన్ని హరితమయం చేయడంలో కృషి చేస్తున్నందుకు గర్వంగా ఉన్నదని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోని జీవ వైవిధ్య ప్రాంతాలను రామ్‌సర్ జాబితాలో చేరుస్తారు. తాజాగా గుజరాత్,హర్యానాల నుంచి రెండు చొప్పున ఈ జాబితాలో చేరాయి. దీంతో,రామ్‌సర్ అంతర్జాతీయ జాబితాలో చోటు దక్కించుకున్న భారత ప్రదేశాల సంఖ్య 46కు చేరిందని కేంద్ర పర్యావరణశాఖ తెలిపింది. ఇరాన్‌లోని రామ్‌సర్ నగరంలో జరిగిన అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా ఈ జాబితాపై నిర్ణయం తీసుకున్నారు. దాంతో, ఈ జాబితాకు ఆ పేరొచ్చింది.

Four more sites in India added to Ramsar list

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News