Saturday, July 5, 2025

మున్నేరులో మునిగి ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, చింతకాని మండలం, చిన్న మండవ గ్రామంలో ఉన్న మున్నేరు పరివాహ ప్రాంతంలో నలుగురు యువకులు గల్లంతై, ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీస్‌లు తెలిపిన వివరాలు ప్రకారం.. నలుగురు యువకులు క్రికెట్ ఆడి తమ దగ్గర ఉన్నటు వంటి బైకు శుభ్రం చేసేందుకు మున్నేరులోకి వెళ్లి బైక్ శుభ్రం చేసి ఒడ్డు మీద పెట్టి మున్నేర్లకు దిగి ఈత కొడుతుండగా ఒక్కసారిగా వరద ఉదృతమై వరద ప్రవాహానికి నలుగురు యువకులు కొట్టుకుపోయారు. నలుగురిలో గోపి అనే యువకుడు ఈత కొట్టడం రావడంతో ఇద్దరు యువకులను సురక్షితంగా బయటికి పంపించి తమ తమ్ముడు కోసం మరల వెళ్ళగా వరద ప్రవాహం ఎక్కువ అవడంతో తమ తమ్ముడిని కాపాడబోయే క్రమంలో తమ్ముడు భయంతో అన్నపై గట్టిగా పట్టుకొని ఊపిరి ఆడకుండా

చేయడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన యువకులు వివరాలు కాశీ మాల నాగ గోపి (22), కాశీమాల నందకిషోర్ (18), తల్లి దండ్రులు చిన్న వెంకటి తల్లి సుభద్ర. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఇద్దరు పిల్లలు పుట్టినప్పటి నుండి చాలా గారాబంగా పోషించుకొని బ్రతికించుకొని ఈ రోజు ఆ ఇద్దరు పిల్లల్ని కోల్పోవడం తల్లిదండ్రులు గుండె పగిలేలా వాపోతున్నారు. దీంతో గ్రామం అంతా విషాద అలుముకున్నాయి. మృతదేహాలను పోలీస్‌లు పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఏఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. తహశీల్దార్ టీ కరుణాకర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలకు బయటకు తీయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News