Tuesday, September 9, 2025

అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని.. ఫ్రాన్స్‌లో కూలిపోయిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

పారిస్: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరౌ ఓడిపోవడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. దీంతో, ఫ్రాన్స్ కేవలం 12 నెలల్లోనే నాల్గవ ప్రధానమంత్రిని ఎన్నుకోనుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నియమించిన ప్రధాని బేరౌకు వ్యతిరేకంగా 364-194 ఓట్ల మెజారిటీ రావడంతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు.

ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిపై బేరౌ స్వయంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అవిశ్వాస తీర్మానానికి ముందు ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రాన్స్ అప్పులను అరికట్టడానికి తన ప్రణాళికలకు మద్దతు ఇవ్వాలని ఆయన శాసనసభ్యులను కోరారు. యూరప్‌లో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఫ్రాన్స్‌పై ఉన్న అప్పులు బెదిరింపులకు గురిచేస్తున్నాయని అన్నారు. “ప్రభుత్వాన్ని కూల్చివేసే శక్తి మీకు ఉంది.. కానీ వాస్తవాన్ని తుడిచిపెట్టే శక్తి మీకు లేదు” అని పేర్కొన్నారు.

Also Read: నేపాల్‌ రక్తసిక్తం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News