Saturday, May 4, 2024

విశ్వాస పరీక్షలో నెగ్గిన బోరిస్ జాన్సన్

- Advertisement -
- Advertisement -

Boris Johnson wins confidence test

లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. బోరిస్‌పై సొంతపార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ గేట్ వ్యవహారంపై జాన్సన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 మంది సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది ఓటు వేశారు. అవిశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం తనకు శుభపరిణామం అని పేర్కొన్నారు. ఇది చాలా సానుకూల , నిర్ణయాత్మకమైన ఫలితం అని తాను భావిస్తున్నట్టు జాన్సన్ తెలిపారు. ప్రధానంగా ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. 2019 లో జాన్సన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరిగిన విషయం విదితమే. అయితే కొవిడ్ నియమావళిని ఉల్లంఘించి ఆ పార్టీలకు ప్రధాని బోరిస్ హాజరైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News