Sunday, November 3, 2024

ఆల్‌రౌండ్ జర్నలిస్టుగా బ్రిటన్ మాజీ ప్రధాని

- Advertisement -
- Advertisement -

లండన్ ః బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ టీవీ, పత్రికల జర్నలిస్టుగా చురుకైన బాధ్యతలు చేపట్టనున్నారు. తాను జిబి న్యూస్ ఛానల్‌లో వ్యాఖ్యాతగా, వార్తా విశ్లేషకుడిగా మారుతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇది కాకుండా ప్రముఖ పత్రిక ది డైలీ మొయిలీకి కాలమిస్టు కూడా కాబోతున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి కొత్త పాత్రలో కన్పించనున్నట్లు, దేశంలో తదుపరి పార్లమెంట్ ఎన్నికల కవరేజీ బాధ్యత కూడా తీసుకోనున్నట్లు ఈ మాజీ ప్రధాని తెలిపారు. రష్యా, చైనా, ఉక్రెయిన్ ఇతర అంశాలపై విశ్లేషించనున్నట్లు , తన హయాంలో ఎదుర్కొన్న సవాళ్లను తెలియచేయనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News