Thursday, April 25, 2024

బ్యాంక్‌లో దళారుల దందా

- Advertisement -
- Advertisement -

మాయమైన పింఛన్ డబ్బులు
చనిపోయిన వ్యక్తులు ఖాతాలో డబ్బులు మాయం
చనిపోయిన వాళ్ళ పింఛన్లు గోల్‌మాల్
పింఛన్ల మాయంలో ఎవరి ప్రమేయం ఎంత..?
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

మన తెలంగాణ/కల్లూరు : మనుషులు ఉండగానే పైసలు ఇవ్వని బ్యాంకులో డబ్బులు ఎలా మాయమైపోతాయి. అందులోనూ చనిపోయిన వారి పింఛన్లు మాయవటం ఆశ్చర్యం కలిగించే సంఘటన చెన్నూరు ఏపిజివిబిలో చోటుచేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో ఎప్పుడో చనిపోయిన కుటుంబ సభ్యుల పింఛన్లు ఇప్పటికీ రావడం, వచ్చిన పెన్షన్లు మాయం కావడంతో కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఏపిజివిబి బ్యాంక్‌లో చనిపోయిన వ్యక్తుల ఖాతాలో ఉన్న డబ్బులు మాయమైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంక్ పరిధిలో ఆయా గ్రామాలకు సంబంధించిన ఖాతాదారులు వారి పెన్షన్లు విధిగా జమవుతున్నాయి. విచిత్రమేమిటంటే గత సంవత్సర కాలం నుండి చనిపోయినా వారి కూడాఖాతాలో జమైపోతున్నాయి.

చనిపోయిన వారికి ఖాతాలో డబ్బులు జమ కావడంతో వ్యవస్థలో లోపమా?.? అధికారుల లోపమా.?? విషయం పక్కన పెడితే గుట్టచప్పుడు కాకుండా కొంత మంది బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై పించన్ డబ్బులు మాయచేసిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఖాతాలో ఉన్న డబ్బులు తీయాలంటే బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎదురుగా వ్యక్తి వారి సంతకం తనిఖీ చేసి నిజ నిర్దారణ చేసుకున్న తరువాత బ్యాంక్ అధికారులు సదరు వ్యక్తికి నగదును అందజేస్తారు. చనిపోయిన వ్యక్తి లేకుండా అయినా ఖాతాలో డబ్బులు తీయడం అసాధారణమైన పని కానీ కాసులకు కక్కుర్తిపడి కొందరు చనిపోయిన వారి పెన్షన్‌ల మీద అక్రమాలకు తెర లేపారు. ఈ అక్రమా ల వెనుక బ్యాంక్ అధికారులను మంచి చేసుకోనైనా లేక ఫోర్జరీ సంతకాలతోనైనా మధ్యవర్తుల ద్వారా నైనా ఆడబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశముంది. బ్యాంక్‌లో చనిపోయిన వ్యక్తుల పెన్షన్లు మాయం కావడంపై అధికారుల పాత్ర ఎంతైనా ఉండొచ్చని అనుమానాలు రేకెత్తిస్తుంది. చనిపోయిన పెన్షన్‌దారుల సంతకాలతో వారి ప్రమేయం లేకుండా పోయిన ఎవరి ప్రమేయంతో బ్యాంకులో ఉన్న డబ్బులు మాయమైన పరిస్థితులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెందిన బీరవెల్లి నారాయణ, తాళ్ళూరి ఆదిలక్ష్మి సుమారు 9 నెలల క్రితం చనిపోయిన వారి ఖాతాలో పింఛన్లు డబ్బులు జమ కావడంతో ఇది పసిగట్టిన కొందరు ఈ డబ్బులు ఎలా కాజేయాలని వ్యూహం పన్ని వారి ఖాతాల్లో నుండి సుమారు 20వేల రూపాయలును డ్రా చేశారు. బ్యాంక్ అధికారులు, పెన్షన్లు మంజూరు చేసే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి చనిపోయిన వారిని గుర్తించి పెన్షన్ల లీస్టు నుండి తొలగించగలిగితే పెన్షన్లు ఇచ్చే బ్యాంక్ అధికారులు వచ్చిన నిర్ధారణ చేసి డబ్బులు ఇవ్వవలిసి ఉండగా నిర్లక్షం ఇచ్చే బ్యాంక్ అధికారులు వచ్చిన వ్యక్తిని నిర్ధారణ చేసి డబ్బులు ఇవ్వవలిసి ఉండగా నిర్లక్షం వల్ల ప్రభుత్వ థనం దుర్వినియోగం కాదు. పెన్షనర్లకు గత మూడు సంవత్సరాల నుండి దరఖాస్తు చేసుకున్న పెన్షన్ రావడం లేదు కానీ, చనిపోయిన వారి ఖాతాలో లక్షల రూపాయలు జమ అవుతున్నాయి. సుమారు చనిపోయిన వారు 20 మందికి పైబడి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి బ్యాంకులపై తక్షణమే విచారణ జరిపి మాయమైన పెన్షన్ డబ్బులు రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News