Tuesday, July 15, 2025

బిసి స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని 12 బిసి స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సి, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్‌లకు ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ ప్రోగ్రాం‘ ను ఆగస్టు 25 నుం 150 రోజుల పాటు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ‘www.tgbcstudycircle.cgg.gov.in‘ ద్వారా ఈ నెల 16 నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కలిగి ఉండాలన్నారు. డిగ్రీ పరీక్షలో అత్యధిక శాతం మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1000 చొప్పున ఐదు నెలల పాటు స్టైఫండ్ మంజూరు చేస్తారు. మరిన్ని వివరాలకు ఫోన్ 040- 24071178 ను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News