Saturday, May 31, 2025

సినర్, గాఫ్ ముందుకు..

- Advertisement -
- Advertisement -

మూడో రౌండ్‌లో జ్వరేవ్, పెగులా

పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషు సింగిల్స్‌లో టాప్ సీడ్ జన్నిక్ సినర్ (ఇటలీ), మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా), మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) రెండో రౌండ్‌లో విజయం సాధించారు. ఇక పురుషుల సింగిల్స్‌లో 9వ సీడ్ డి మినార్ (ఆస్ట్రేలియా) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. అగ్రశ్రేణి ఆటగాడు సినర్ రెండో రౌండ్‌లో అలవోక విజయం సాధించాడు. రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)తో జరిగిన పోరులో సినర్ 63, 60, 64తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సినర్ వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను చేసుకున్నాడు. మరో పోటీలో 17వ సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) జయభేరి మోగించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ వాల్టన్‌తో జరిగిన రెండో రౌండ్‌లో రుబ్లేవ్ 76, 61, 76తో విజయాన్ని అందుకున్నాడు. జ్వరేవ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. నెదర్లాండ్స్ ఆటగాడు జాస్పర్‌తో జరిగిన పోరులో జ్వరేవ్ 36, 61, 62, 63తో విజయం సాధించాడు.

గాఫ్ అలవోకగా..

మహిళల సింగిల్స్‌లో కొకొ గాఫ్ అలవోక విజయంతో మూడో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో గాఫ్ 62, 64తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన టెరెజా వలెన్‌టొవాను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గాఫ్ వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. మరో పోటీలో పెగులా 63, 76తో అమెరికాకే చెందిన అన్ లీను ఓడించింది. తొలి సెట్‌లో సునాయాసంగా గెలిచిన పెగులాకు రెండో సెట్‌లో కాస్త పోటీ ఎదురైంది. అయితే టైబ్రేక్‌లో సెట్‌ను గెలుచుకున్న పెగులా మూడో రౌండ్‌కు చేరుకుంది. ఆరో సీడ్ అండ్రివా కూడా మూడో రౌండ్‌లో ప్రవేశించింది. రెండో రౌండ్‌లో అండ్రివా 63, 64తో అమెరికా క్రీడాకారిణి క్రుగర్‌ను ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News