Monday, August 25, 2025

ఖైరతాబాద్ బడా గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని రోజులంటే?

- Advertisement -
- Advertisement -

ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆంక్షలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఖైరతాబాద్ బడా గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే 6వ తేదీ వరకు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
వివి స్టాట్యూ నుంచి వయా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ నుంచి బడా గణేష్ వైపు వెళ్లే వాహనాలను రాజ్‌దూత్ లైన్ వైపు అనుమతించరు. అక్కడి నుంచి ఇక్బాల్ మిన్‌ర్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ థయేటర్ వైపు వయా మింట్ కాంపౌండ్ నుంచి వచ్చే వాహనాలను సెక్రటేరియట్ టెంపుల్ ఎక్స్ రోడ్డు మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
నెక్లెస్ రోటరి నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు అనుమతిస్తారు.
నిరంకారి నుంచి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. పోస్ట్ ఆఫీస్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.

రద్దీ ఉండే జంక్షన్లు….
బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య రానుండడంతో కొన్ని జంక్షన్లు రద్దీగా ఉండనున్నాయి. ఖైరతాబాద్, షాదన్ కాలేజీ, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ.
పార్కింగ్ ప్రాంతాలు…
నెక్లెస్ రోడ్డు, ఎన్‌టిఆర్ గార్డెన్ వైపు నుంచి బడా గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వాహనాలను రేస్ రోడ్డు, ఎన్‌టిఆర్ ఘాట్, హెచ్‌ఎండిఏ పార్కింగ్, ఐ మ్యాక్స్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్, సరస్వతీ విద్యా మందిర్ హైస్కూల్, ఐ మ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లేస్‌లో పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News