హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం కొనసాగుతోంది.నగరంలో 11 రోజులపాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు హుస్సేన్ సాగర్ కు భారీగా తరలివస్తున్నాయి.సిటీలో దాదాపు లక్షకు పైగా గణనాథులు కొలువుదిరడంతో మంగళవారం ప్రారంభమైన నిమజ్జనంకార్యక్రమం బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నంలోకు నిమజ్జనాలు జరగనున్నాయి.
మరోవైపు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కార్యాలయం నుంచి పరిశీలిస్తున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. సాంకేతిక కారణాలతో మోరాయిస్తున్న క్రేన్ల స్థానంలో తక్షణమే వేరే క్రేన్ల ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అత్యాధునికమైన యంత్రాలతో హుస్సేన్ సాగర్‌ను క్లీనింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.