Monday, September 1, 2025

గణేశ్ శోభాయాత్రలో అపశృతి.. నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లలో విషాదం చోటు చేసుకుంది. గణేశ్ శోభా యాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దుర్ఘటనలో మృతులను అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ(52), మురళి(33), నరసింహమూర్తి(32), దినేష్(10)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News