హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై బారికేడ్లను గణేష్ ఉత్సవ సమితి తొలగించింది. రాష్ట్ర హైకోర్టు మేరకు ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదని జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ట్యాంక్ బండ్ వద్ద వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ ప్లెక్సీలు, భారీ కేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్లెక్సీలు, భారీ కేడ్లను తొలగించి.. గణేష్ నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త రూల్స్ తీసుకొచ్చి భక్తులను ఇబ్బందులు పెట్టొదన్నారు.
2022-23లోనూ ఇలాగే రూల్స్ పెట్టి.. చివరకు అనుమతించాన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఇసారి కూడా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఏర్పాట్లు చేయకుంటే.. రేపు హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ మండపాల్లోనే వినాయకులను ఉంచుతామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు గణేశ్ ఉత్సవ సమితి నేతలు.