Tuesday, October 15, 2024

జాన్సన్ గ్రామర్ హై స్కూల్ లో పిల్లలను వదిలి… లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలో జిల్లాలోని నాచారంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్ఎంటి కమాన్ సమీపంలో స్కూటీని గ్యాస్ సిలిండర్ లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టిఎస్ 08 యుఇ అనే నంబర్ గల ఇండేన్ గ్యాస్ సిలిండర్ లారీ చర్లపల్లి నుంచి రాంనగర్ వెళ్తోంది. గీతా అనే మహిళ తన స్కూటీపై పిల్లలను నల్లకుంటలోని జాన్సన్ గ్రామర్ హైస్కూల్ లో వదిలేసి తిరిగి వస్తుంది. హబ్సిగూడ దాటిన తరువాత నాచారం రోడ్డులో హెచ్ఎంటి కమాన్ వద్ద ఆమె స్కూటీని సిలిండర్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని లారీ డ్రైవర్ నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News