Sunday, December 3, 2023

కొంపల్లి సుచిత్ర మెయిన్ రోడ్డులో గ్యాస్ లీక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని సుచిత్ర మెయిన్ రోడ్డుపై గ్యాస్ లీక్ జరిగింది. గ్యాస్ లీక్‌తో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మెయిన్ రోడ్డుపై మంటలు రావడంతో జనం పరుగులు తీశారు. భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ పైప్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ సిబ్బంది మంటలను ఆర్పేశారు. జనం ఎక్కువగా ఉన్న చోట గ్యాస్ లీక్ జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎక్కడ గ్యాస్ లీక్ జరగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News