Tuesday, May 7, 2024

జర్మనీలో పౌరసత్వం పొందడానికి నిబంధనల సడలింపు

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ : జర్మనీలో దేశ పౌరసత్వం అలాగే ద్వంద్వ పౌరసత్వంపై ఉన్న ఆంక్షలు నిబంధనలు సడలించారు. ఈ మేరకు రూపొందిన ప్రణాళికను ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. వలసల సంఖ్యను పెంచడానికి, నిపుణులైన కార్మికులను ఆకర్షించడానికి ఇది దోహదం చేస్తుందని జర్మనీ ప్రభుత్వం పేర్కొంది. ఓలాఫ్ షోల్జ్ నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు పార్లమెంట్‌లో 382234 ఓట్ల తేడాతో నెగ్గింది. జర్మనీ లోని 8.44 కోట్ల జనాభాలో 1.2 కోట్ల మందికి స్థానిక పౌరసత్వం లేదు. వారిలో 53 లక్షల మంది దాదాపు పదేళ్లుగా జర్మనీలో నివసిస్తున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2022లో దాదాపు 1.68 లక్షల మందికి పౌరసత్వం లభించింది. ఇప్పుడీ సంస్కరణల వల్ల ఫాన్స్ వంటి పొరుగు దేశాలకు పోటీగా జర్మనీ నిలుస్తుందని , కెనడా,

అమెరికా దేశాల మాదిరి తాము కూడా నైపుణ్యం కలిగిన వారికి ఆఫర్లు అందించవలసి వస్తుందని, ఇందులో పౌరసత్వం కూడా ఒక భాగమేనని అంతర్గత వ్యవహారాల మంత్రి నాన్సీ ఫేజర్ వివరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జర్మనీలో ఎనిమిదేళ్లు నివసిస్తేనే పౌరసత్వం పొందగలుగుతారు. ప్రత్యేక సందర్భాల్లో ఐదేళ్లకు అవకాశం కల్పిస్తారు. అయితే తాజాగా దీన్ని ఐదేళ్లు, మూడేళ్లకు తగ్గించారు. అలాగే తల్లిదండ్రులు స్థానికంగా ఎనిమిదేళ్లు చట్టబద్ధంగా ఉంటే… ఇక్కడ జన్మించే పిల్లలు పుట్టుకతో జర్మనీ పౌరులుగా మారతారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం దీన్ని ఐదేళ్లకు తగ్గించారు. ఈయూ దేశాలు, స్విట్జర్లాండ్ మినహా ఇతర దేశాల పౌరులు జర్మనీ పౌరసత్వం పొందినప్పుడు వారి మునుపటి జాతీయతను వదులుకోవాల్సి వచ్చేది. కొన్ని మినహాయింపులు ఉండేవి. ఇప్పుడు ఈ ఆంక్షలు తొలగిపోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News