Saturday, June 3, 2023

మౌలాలి విషాదం.. చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి (వీడియో)

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: జిహెచ్ఎంసి చెత్త సేకరణ వాహనం కిందపడి చిన్నారి మృతిచెందిన విషాద సంఘటన మేడ్చల్ లో సోమవారం చోటుచేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో వాహనం కిందపడి 16 నెలల బాలుడు మృత్యువాత పడ్డాడు. వాహనం రివర్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి బాలుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News