Friday, January 27, 2023

గిల్‌కు ముద్దుపేరు పెట్టా: గావస్కర్

- Advertisement -

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో మ్యాచ్ టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో అతడిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసించారు. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించిన గిల్‌కు గావస్కర్ నిక్‌నేమ్ పెట్టాడు. మ్యాచ్ జరిగిన తరువాత గిల్‌తో గావస్కర్ మాట్లాడారు. శుభ్‌మన్ గిల్‌కు తాను ముద్దుపేరు పెడుదామని అనుకుంటున్నానని, స్మూత్ గిల్ అని పేరు పెట్టానని చెప్పడంతో గిల్ నవ్వారు. నీకు అభ్యంతరం లేదుగా అని అడిగారు. దీంతో మళ్లీ స్మైల్ ఇవ్వడంతో పాటు తనకు అభ్యంతరం లేదని గిల్ చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles