Friday, April 26, 2024

బిజెపికి గిరిధర్ గమాంగ్ రాజీనామా….. త్వరలో బిఆర్‌ఎస్‌లో చేరిక

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ బుధవారం బిజెపికి రాజీనామా చేశారు. త్వరలోనే వారిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన తండ్రి, కుమారుడు బుధవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో తాము బిజెపికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు తమ రాజీనామా లేఖలను పంపినట్లు వారు తెలిపారు.

గత కొద్ది సంవత్సరాలుగా ఒడిశా ప్రజలకు తాను తన రాజకీయ, సామాజిక, నైతిక బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో గమాంగ్ పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆయన కోరారు.బిఆర్‌ఎస్‌లో తాను చేరనున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. తాను ఒక జాతీయ పార్టీ(కాంగ్రెస్) నుంచి మరో జాతీయ పార్టీలో(బిజెపి) చేరానని, ఒడిశాలో పాదం మోపనున్న మరో జాతీయ పార్టీలో తాను చేరనున్నానని గిరిఢర్ తెలిపారు. వయసు రీత్యా తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. తన కుమారుడు శిశిర్ పోటీ చేస్తాడని ఆయన చెప్పారు. బిజెపిలో తమకు జరుగుతున్న అవమానాలను భరించలేకనే ఆ పార్టీకి రాజీనామా చేశామని కూడా తండ్రీ కుమారుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News