Tuesday, June 18, 2024

ప్లాస్టిక్ బ్యాగ్‌లో బాలిక మృతదేహం… ఐస్‌క్రీమ్ కోసం వెళ్లి

- Advertisement -
- Advertisement -

ముంబయి: అదృశ్యమైన ఎనిమిదేళ్ల బాలిక, మృతదేహంగా ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూటకట్టి కనిపించిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెల్హర్ ప్రాంతంలో వాసయిలో ఎనిమిదేళ్ల బాలిక స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఆడుకోవడానికి వెళ్తున్నానని తండ్రికి చెప్పింది. శుక్రవారం తండ్రి దగ్గర ఐదు రూపాయలు తీసుకొని ఐస్ క్రీమ్ కొనడానికి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమె కనిపిస్తే చెప్పిన వారికి 20 వేల రూపాయలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఓ రూమ్‌లో నుంచి దుర్వాసన వస్తుందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రూమ్ డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేశారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లో మృతదేహం కనిపించడంతో ఓపెన్ చేసి చూడగా కాళ్లు తాడుతో కట్టి ఉన్నాయి. రూమ్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసిటివి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసుతన్నారు. ఆ రూమ్‌లోకి బాలికను ఎందుకు తీసుకెళ్లారు. ఏం చేశారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టమ్ రిపోర్ట్ వస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News