Wednesday, September 17, 2025

రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

Girl dies in road accident at Sangareddy

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో 9ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిథిలోని కలెక్టరేట్ ముందు జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… సంగారెడ్డి గణేష్ నగర్ కాలనీకి చెందిన రవి కిరణ్ కూతురు తనిష్క (9)తన బాబాయి రామకృష్ణతో కలిసి స్కూటీపై ఉదయం పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి గణేష్ నగర్‌కు వెళ్తుండగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యూటర్న్ తీసుకున్నాడు. దీంతో స్కూటీ అదుపు తప్పి పడిపోయిందన్నారు. వెనక కూర్చున్న తనిష్క రోడ్డుపై పడిపోవడంతో వెనక నుండి వేగంగా వస్తున్న ఆర్టీసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్నీ నడపడంతో చిన్నారిపై నుండి వెళ్లింది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాలిక తండ్రి రవికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News