Tuesday, April 30, 2024

రెండు రోజుల్లో ఆలయాలకు చెక్కుల పంపిణీ : మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Financial assistance to temples in two days: Minister Talasani

 

హైదరాబాద్ : నగరంలో బోనాల ఉత్సవాలకు ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాలు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అదికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. 3500 పైగా ప్రభుత్వ, ప్రైవేటు దేవాలయాలకు ఈ ఆర్థిక సహాయం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 17న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజుల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయనున్నామన్నారు. 24వ తేదీన బోనాలు నిర్వహించనున్న హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18న చెక్కుల పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులచే ప్రతి నియోజకవర్గ పరిధిలోని 4 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయనున్నామని వివరించారు. పాతబస్తీలో 25 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. జంట నగరాల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News