Monday, May 6, 2024

‘ఉగ్ర’ అశోక సింహాలపై అభ్యంతరం.. మోడీ తీరుపై ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  జాతీయ చిహ్నంలోని అశోక సింహాలు మనోహరంగా, స్థిరచిత్తంగా, వివేకానికి ప్రతీకగా ఉంటాయని కాని వాటిని ఉగ్రంగా, భీకరంగా, భయోత్పాతాన్ని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని వారు ఆరోపించారు. ఈ తప్పును వెంటనే సరిదిద్ది జాతీయ చిహ్నం గౌరవాన్ని కాపాడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ హరివంశ్ సమక్షంలో దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవనంపైన జాతీయ చిహ్నమైన మూడు సింహాల ప్రతిమలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించకుండా మోడీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

ప్రధాని మోడీ ఆవిష్కరించిన సింహ ప్రతిమలపై లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. తాను ఆవిష్కరించిన సింహం ప్రతిమ సారనాథ్‌లోని అశోక స్థూపంలో ఉన్న సింహాన్ని పోలి ఉందా లేక గిర్ అడవుల్లోని సింహంలాగా ఉందా ప్రధాని మోడీ జాగ్రత్తగా గమనించాలని సూచించారు. వెంటనే అవసరమైన మార్పులు చేయాలని ఆయన మోడీని కోరారు. గంభీరంగా ఉండే అశోక సింహాల స్థానంలో భీకరంగా, ఉగ్రరూపంతో ఉన్న సింహాల ప్రతిమలను ఆవిష్కరించి ప్రధాని మన జాతీయ చిహ్నాన్ని అవమానించారని, వెంటనే వాటిని మార్చాలని తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జవహర్ సర్కార్ కోరారు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రశాంతంగా, గంభీరంగా ఉండే సింహాల స్థానంలో ఉగ్ర సింహాలు మన జాతీయ చిహ్నంలో చేరాయని, ఇది మన మోడీ సృష్టిస్తున్న నవ భారతమని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

Opposition Slams PM Modi over National Emblem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News