Tuesday, October 15, 2024

హైదరాబాద్‌లో దారుణం.. 20 రోజులు హోటల్‌లో బంధించి యువతిపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. యువతిని హోటల్ లో బందించి 20 రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. చివరకు తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వచ్చి యువతిని రక్షించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కోర్స్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రమ్ లో నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్‌కు రప్పించాడు.

20 రోజుల పాటు నారాయణగూడ లోని ఓ హోటల్ రూమ్ లో నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో హోటల్ రూమ్‌కు తాళం వేసి పరారయ్యాడు. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది. తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో లొకేషన్ ద్వారా నారాయణగూడలోని హోటల్‌కు వెళ్లి యువతిని కాపాడారు. యువతి ఫిర్యాదుతో నిందితుడు కృష్ణచైతన్యను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు .

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News