Saturday, August 16, 2025

హాస్టల్ యజమానిని చితకబాదిన అమ్మాయిలు

- Advertisement -
- Advertisement -

హాస్టల్ యజమానిని  అమ్మాయిలు చితకబాదిన ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటు చేసుకుంది.  ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ యజమాని సత్యప్రకాశ్ తమ పట్ల అసభ్య ప్రవర్తన చేశాడని అమ్మాయిలు ఆరోపించారు.హాస్టల్లోని ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ యజమానిని తల్లిదండ్రులు, అమ్మాయిలు కలిసి చితకబాదారు. తల్లిదండ్రులు  ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News